పదో తరగతి తో జిల్లా సంక్షేమ శాఖ ఎంటిఎస్, కోఆర్డినేటర్ పోస్టుల భర్తీ | WCDSCD Inviting Application for MTS, Co-ordinator | Apply here..
10th, Inter, Degree తో తెలంగాణ జిల్లా సంక్షేమ శాఖ ఎంటిఎస్, కోఆర్డినేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ | చివరి తేది : 11.04.2023 | పూర్తి ఇవరాలు ఇక్కడ..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం - మహిళలు, పిల్లలు, వికలాంగులు, మరియు సీనియర్ సిటిజన్ల శాఖ, అదిలాబాద్ జిల్లా, మహిళా సాధికారత జిల్లా కేంద్రంలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 31-03-2023 ఉదయం 10:30 నుండి, 11.04.2023 సాయంత్రం 05:00 గంటల వరకు అధికారిక నోటిఫికేషన్ తో జత చేసిన దరఖాస్తు ఫామ్ కు సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలను జతచేసి దరఖాస్తు చేయవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు రూ.15,600/- నుండి రూ.38,500/- వరకు జీతంగా చెల్లిస్తారు. ఈ నోటిఫికేషన్ ఈ యొక్క పూర్తి ముఖ్య సమాచారం, విద్యార్హత, గౌరవ వేతనం, ఎంపిక విధానం, వయోపరిమితి, దరఖాస్తు విధానం మొదలగునవి మీకోసం.
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య :05.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
- డిస్టిక్ మిషన్ కోఆర్డినేటర్ - 01,
- జండర్ స్పెషలిస్ట్ - 02,
- ఫైనాన్షియల్ లిటరసీ స్పెషలిస్ట్ - 01,
- ఎంటిఎస్ - 01.. మొదలగునవి.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్, యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి..
10th, ఇంటర్, బ్యాంకింగ్/ ఎకనామిక్స్/ సోషల్ వర్కర్/ సోషల్ సైన్సెస్/ లైఫ్ సైన్సెస్/ న్యూట్రీషియన్/ మెడిసిన్/ హెల్త్ మేనేజ్మెంట్/ సోషల్ వర్క్/ రూరల్ మేనేజ్మెంట్ విభాగంలో గ్రాడ్యుయేషన్ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి :
- 01.07.2023 నాటికి 18 సంవత్సరాల నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను అకాడమిక్ టెక్నికల్ విద్య హాస్పటల్లో కనపరిచిన ప్రతిభ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, రూల్ ఆఫ్ రిజర్వేషన్, స్థానికత ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
- అకడమిక్ విద్యార్హతలకు 80 శాతం మార్కులు,
- అనుభవానికి 20 శాతం మార్కులు, వెయిటేజీ లెక్కిస్తారు.
డిస్ట్రిక్ట్/ జోనల్ కమిటీ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ కొనసాగుతుంది.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.15,600/- నుండి రూ.38,500/- ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్ లో సమర్పించాలి.
ఆఫ్లైన్ దరఖాస్తు ఫీజు :: లేదు.
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం ::
- 31.03.2023 ఉదయం 10:30 నుండి,
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ ::
- 11-04-2023 సాయంత్రం 05:00 వరకు.
ఆఫ్ లైన్ దరఖాస్తు చిరునామా ::
- జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం, డబ్ల్యూసిడి అండ్ ఎస్సీ డిపార్ట్మెంట్, విద్యానగర్, అదిలాబాద్ కు అందజేయాలి.
అధికారిక వెబ్సైట్ :: https://adilabad.telangana.gov.in/
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment