గ్రాడ్యుయేట్లకు సువర్ణవకాశం! రాత పరీక్ష లేకుండా 70 ఖాళీల భర్తీ | Graduate/ Technician/ Diploma Apprentices Recruitment 2023 | Apply Online here..
జనవరి 2021 తరువాత బిఈ/ బిటెక్, ఇంజనీరింగ్ విభాగంలో డిప్లమా & కమర్షియల్ ప్రాక్టీస్ విభాగంలో డిప్లమా అర్హత సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులకు శుభవార్త!
భారతీయ అభ్యర్థులు మాత్రమే అర్హులు.
📌 సౌతెర్న్ రీజియన్ ఆఫ్ బోర్డ్ అప్రెంటీస్ షిప్ ట్రైనింగ్ (కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు పొద్దు చేరి) అభ్యర్థులు విద్యా సంవత్సరం 2023-24 కొరకు క్రింది అప్రెంటీస్ విభాగాల్లో ప్రవేశాల కొరకు ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవచ్చు..
నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ హైదరాబాద్, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 70 గ్రాడ్యుయేట్/ టెక్నీషియన్/ కమర్షియల్ మరియు కంప్యూటర్ ప్రాక్టీస్ లలో అప్రెంటిస్ శిక్షణ ల కోసం అప్రెంటిస్ యాక్ట్ 1961 మరియు అప్రెంటిస్ రూల్ 1973 ప్రకారం ఖాళీలను భర్తీ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేస్తూ ఆన్లైన్ దరఖాస్తులకు ఆహ్వానం పలికింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ భారతీయ యువత ఈ శిక్షణను పూర్తి చేయడానికి ఆన్లైన్ దరఖాస్తులను (UMANG) ఉమంగ్ పోర్టల్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. ముందుగా నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్(NATS) అధికారిక వెబ్ పోర్టల్ నందు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకొని ఉండాలి. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత ఉపయోగించుకోండి. అప్రెంటిస్ శిక్షణ లను పూర్తిచేసినవారికి, రాబోయే కాలంలో విడుదల అయ్యే ఉద్యోగ నోటిఫికేషన్ లలో సంబంధిత పోస్టులకు వెయిటేజీ కల్పించబడుతుంది(ఇప్పటికే SBI, ARMY, NAVY, ITBP, CRPF, BSF, AGNI మరియు భారత రక్షణ దళాల్లో వెయిటేజి కల్పించబడింది). ఇప్పటికే పలు నోటిఫికేషన్ లు అప్రెంటిస్ శిక్షణను పూర్తి చేసినవారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ జారీ చేయబడినవి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 70.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ విభాగంలో..
- ఎలక్ట్రానిక్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ - 05,
- కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ - 05,
- ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ - 03,
- సివిల్ ఇంజనీరింగ్ - 01,
- మెకానికల్ ఇంజనీరింగ్ - 01,
- లైబ్రరీ సైన్స్ - 02.
టెక్నీషియన్ అప్రెంటిస్ విభాగంలో..
- ఎలక్ట్రానిక్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ - 10,
- కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ - 10,
- ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ - 06,
- సివిల్ ఇంజనీరింగ్ - 02,
- మెకానికల్ ఇంజనీరింగ్ - 02.
డిప్లమా ఇన్ కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్ అప్రెంటిస్ విభాగంలో..
- డిప్లమా కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్ - 23.. మొదలగునవి.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఇంజనీరింగ్ టెక్నాలజీ విభాగంలో డిప్లమా..
- సంబంధిత విభాగంలో డిప్లమా అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- అప్రెంటిస్షిప్ రూల్ ప్రకారం ఉండాలి.
ఎంపిక విధానం:
- ఈ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేదు.
- అభ్యర్థులు అకడమిక్/ టెక్నికల్ విద్యార్హత ల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా ఎంపిక జాబితా తయారుచేసి, ఇంటిమేషన్ ఇస్తారు.
- షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు మాత్రమే సీటు కేటాయించబడుతుంది.
అప్రెంటిస్షిప్ శిక్షణ కాలం ::
- 12 నెలలు (ఒక సంవత్సరం)
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు అప్రెంటిస్షిప్ రూల్స్ ప్రకారం గౌరవ వేతనం ప్రతినెలా స్కాలర్షిప్పులు రూపంలో.. కోర్సులను బట్టి రూ.8,000/- నుండి రూ.9,000/- వేల వరకు చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్ లో సమర్పించాలి.
ఆన్ లైన్ దరఖాస్తు ఫీజు :: లేదు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 13.05.2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 02.06.2023 వరకు..
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక వెబ్సైట్ :: https://www.isro.gov.in/
నేషనల్ అప్రెంటిస్ ట్రైనింగ్ స్కీమ్(NATS) వెబ్ పోర్టల్ నందు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి/ ఐడి పొందడానికి లింక్:: http://www.mhrdnats.gov.in/
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు UMANG హోటల్ ద్వారా సమర్పించడానికి లింక్ :: https://web.umang.gov.in/
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment