జిల్లా ఆరోగ్య శాఖా 10th, Degree తో పలు ఉద్యోగాల భర్తీ | Government General Hospital Eluru 68 Posts Recruitment 2023.
నిరుద్యోగులకు శుభవార్త!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న జిల్లాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ లను విడుదల చేస్తూ ఉద్యోగ నియామకాలను నిర్వహిస్తూ వస్తుంది. తాజాగా 10th మరియు ఆపై అర్హత లతో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు, జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి వారి కార్యాలయం ఏలూరు జిల్లా, ఖాళీగా ఉన్నటువంటి వివిధ మెడికల్ సిబ్బంది పోస్టుల నియామకానికి అధికారికంగా నోటిఫికేషన్ విడుదలైంది.. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు 11.09.2023 నుండి 16.09.2023 వరకు దరఖాస్తులను ఆఫ్లైన్ రూపంలో కోరుతోంది. అవుట్సోర్సింగ్ ప్రతిపాదికన నియామకాలు నిర్వహిస్తున్న ఈ పోస్టులకు అభ్యర్థులు చివరి తేదీ నాటికి లేదా అంతకంటే ముందే చేరే విధంగా స్వయంగా లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చు. ఎంపికైన అభ్యర్థులు ఏలూరు జిల్లా దవాఖాన లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ.
ఖాళీల వివరాలు :- మొత్తం ఖాళీల సంఖ్య : 68.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
- మెడికల్ ఆఫీసర్ - 11,
- స్టాఫ్ నర్స్ - 25,
- ఫార్మసిస్ట్ - 10,
- ల్యాబ్ టెక్నీషియన్ - 04,
- డాటా ఎంట్రీ ఆపరేటర్ - 06,
- లాస్ట్ సర్వీసేస్ - 12.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను బట్టి 10వ తరగతి/ ఇంటర్మీడియట్ తో GNM (జనరల్ నర్సింగ్ & మిడ్ వైఫెరీ)/ D. Pharma, B. Pharma/ DMLT లేదా B.Sc (MLT)/ B.Sc నర్సింగ్/ ఎంబిబిఎస్ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- సంబంధిత మెడికల్ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండడం తప్పనిసరి.
వయోపరిమితి :
- 01-07-2023 నాటికి 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు బయో పరిమితిలో సడలింపు వర్తిస్తుంది. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేదు.
- ధృవపత్రాల పరిశీలన ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక చేస్తారు.
- అభ్యర్థులు అకడమిక్ మరియు టెక్నికల్ విద్యార్థుల్లో కనబరిచిన ప్రతిభ అనుభవం ఆధారంగా మొత్తం 100 మార్కులకు నియామకాలు చేపడతారు.
- అకాడమిక్ టెక్నికల్ విద్యార్హత లో కనబర్చిన ప్రతిభకు 75% మార్కులు.
- ఇతర అర్హతలకు 25% మార్కులు కేటాయిస్తారు.
- ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలందించిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
- ఈ ఉద్యోగాలకు ఎంపికలు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఉంటుంది.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.11,000/- నుండి రూ.60,000/-ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్ లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు : లేదు.
నోటిఫికేషన్ ప్రచురణ తేదీ :: 08.09.2023.
నోటిఫికేషన్ నంబర్ 03/NUHN/2023.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 11-09-2023 నుండి,
దరఖాస్తుకు చివరి తేదీ : 16-09-2023 వరకు.
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
అధికారిక వెబ్సైట్ :: https://eluru.ap.gov.in/
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment