గ్రామీణ వ్యవసాయ శాఖ లో ఉద్యోగాల భర్తీ! బ్యాచిలర్ డిగ్రీలు మిస్ అవ్వకండి! NABARD Recruitment for 150 Permanent Posts Apply Online..
నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (NABARD) దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి మొత్తం 150 ఉద్యోగాల భర్తీకి, ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 2వ తేదీ నుండి ప్రారంభమై 23వ తేదీన ముగుస్తున్నట్లు అధికారిక నోటిఫికేషన్లో పేర్కొన్నారు. నాబార్డ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ గ్రేడ్-ఏ ఆఫీసర్ 2023, నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలలైనా; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం.. మొదలగు పూర్తి వివరాలు మీకోసం.
పోస్టుల వివరాలు:- మొత్తం పోస్టుల సంఖ్య: 150.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
- జనరల్ - 77,
- కంప్యూటర్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ - 40,
- ఫైనాన్స్ - 15,
- కంపెనీ సెక్రటరీ - 03,
- సివిల్ ఇంజనీరింగ్ - 03,
- ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ - 03,
- జియో ఇన్ఫర్మేటిక్స్ - 02,
- ఫారెస్ట్రీ - 02,
- ఫుడ్ ప్రాసెసింగ్ - 02,
- స్టాటిస్టిక్స్ - 02,
- మాస్ కమ్యూనికేషన్ / మీడియా స్పెషలిస్ట్ - 01.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో కనీసం 60% (ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు 55%)మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వయో-పరిమితి:
- 01.09.2023, నాటికి 21 సంవత్సరాల నుండి 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. రిజర్వేషన్ వర్గాలవారికి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి. పూర్తి వివరాలకు దరఖాస్తు చేయడానికి ముందు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- ఈ ఉద్యోగాలకు ఎంపిక లు రాత పరీక్ష ఆధారంగా నిర్వహిస్తారు.
- రాత పరీక్ష ప్రిలిమినరీ, మెయిన్స్ రూపంలో ఉంటుంది.
- పూర్తి వివరాలతో కూడిన అధికారిక నోటిఫికేషన్ ఇక్కడ క్లిక్ చేసి చదవండి.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్ రూ.44,500 - 89150/- ప్రకారం అన్ని అలవెన్స్ తో కలిపి దాదాపుగా రూ.1,00,000/- వరకు చెల్లిస్తారు.
రాత పరీక్ష సెంటర్ల వివరాలు :
- రాత పరీక్ష సెంటర్లను దేశవ్యాప్తంగా 33 రాష్ట్రాల్లో ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లోని జిల్లాలను ఎన్నుకోవచ్చు..
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
- ఇంటిమేట్ చార్జీల కోసం రూ.150 చెల్లించాలి.
మిగిలిన అందరికీ దరఖాస్తు ఫీజు రూ.650/-.
- ఇంటిమేట్ చార్జీల కోసం రూ.150/-.
- మొత్తం ఫీజు రూ.800/-.
- ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 02.09.2023 నుండి,
- ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 23.09.2023 వరకు.
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి / డౌన్లోడ్ చేయండి.
అధికారిక వెబ్సైట్ :: https://www.nabard.org/
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment