TS ePASS | Corporate Jr College Results Out | తెలంగాణ కార్పొరేట్ జూనియర్ కాలేజ్ ఫలితాలు విడుదల..
విద్యార్థులకు అలర్ట్...!
ఎలాంటి రాతపరీక్ష లేకుండా, కేవలం 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో(విద్యా సంవత్సరం 2021-22) సాధించిన మార్కుల ఆధారంగా ఉచితం కార్పొరేట్ జూనియర్ కాలేజ్ ప్రవేశాలకు సంబంధించిన పరీక్ష ఫలితాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. ఇక్కడ సీటు సాధించిన అభ్యర్థులకు రెండు సంవత్సరాల ఉచిత ఇంటిగ్రేటెడ్ శిక్షణతో కార్పొరేట్ స్థాయి జిల్లా ప్రముఖ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలు కల్పిస్తారు, రెండు సంవత్సరాల పాటు ఎలాంటి ఫీజు అవసరం లేకుండా విద్య నభ్యసించ వచ్చును.. మరియు ఒక్కొక్క విద్యార్థికి ₹.35 వేల రూపాయల ఫీజు, సంవత్సరానికి ₹.3 వేలు పాకెట్ మనీ అందిస్తారు.. ఈ బృహత్తర కార్పొరేట్ కాలేజ్ ప్రవేశాలకు 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో 7.0 GPA దాటి ప్రభుత్వ పాఠశాలలో చదివిన అభ్యర్థులు అర్హులు..
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కార్పొరేట్ Jr College ప్రవేశ ఫలితాలు తాజాగా విడుదలైనయి.
2022-23 విద్యా సంవత్సరానికి కార్పొరేట్ జూనియర్ కాలేజ్ ప్రవేశ ఫలితాలను తనిఖీ చేయడం ఎలా?.
ఈ క్రింది సోపానాలను అనుసరించడం ద్వారా కార్పొరేట్ జూనియర్ కాలేజ్ ప్రవేశ పరీక్ష ఫలితాలను సులభంగా తనిఖీ చేయవచ్చు..
◆ దరఖాస్తు చేసుకున్న విద్యార్థినీ విద్యార్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
◆ అధికారిక వెబ్ సైట్ లింక్ :: https://telanganaepass.cgg.gov.in/
◆ తదుపరి, కార్పొరేట్ జూనియర్ కాలేజ్ ఫలితాలు-2022 తనిఖీ చేయడానికి అధికారిక వెబ్ సైట్ లోని Corporate Admissions లింక్ పై క్లిక్ చేయండి.
◆ కార్పొరేట్ అడ్మిషన్స్ 2022-23 అధికారిక వెబ్ పేజీ లోకి రీ డైరెక్ట్ అవుతారు..
◆ తదుపరి ఇక్కడ కనిపిస్తున్న, Know Your Application Status లింక్ పై క్లిక్ చేయండి.
◆ ఇప్పుడు మీరు కార్పొరేట్ జూనియర్ కాలేజ్ ధరఖాస్తు స్థితి చెక్ చేయడానికి సంబంధించిన పేజీలోకి రీ డైరెక్ట్ అయినారు.
◆ మీ అప్లికేషన్ ఐడి, SSC హాల్ టికెట్ నెంబర్, పాస్ అయిన సంవత్సరం, మరియు పుట్టిన తేదీలను నమోదు చేసి.. Get Details లింక్ పై క్లిక్ చేయడం ద్వారా మీ దరఖాస్తు స్థితి ను తెలుసుకోవచ్చు..
◆ ఎంపికైన అభ్యర్థులు తప్పనిసరిగా సంబంధిత కళాశాలలో ప్రవేశం కోసం జిల్లా అధికారిని ఆగస్టు 3వ తేదీ లోపు సంప్రదించాల్సి ఉంటుంది.
అధికారిక వెబ్సైట్ :: https://telanganaepass.cgg.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
డైరెక్ట్ గా కార్పొరేట్ జూనియర్ కాలేజ్ దరఖాస్తు స్థితిని ఇప్పుడే తెలుసుకోవడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment