తెలంగాణ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షా ఫలితాలు విడుదల || మార్క్ షీట్ డౌన్లోడ్ చేయండి ఇలా..
ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షా ఫలితాలను సోమవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి గారు వెల్లడించారు. పరీక్ష ఫీజు చెల్లించిన విద్యార్థులందరూ (4,51,585) ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు.
ఉత్తీర్ణత సాధించిన వారిలో 2,28,754 మంది బాలికలులు కాగా, 2,22,831 మంది బాలురు ఉన్నట్లు ప్రకటనలో తెలిపారు. మొత్తం ఉత్తీర్ణత సాధించిన వారిలో 1,76,719 గురు విద్యార్థులు "ఏ" గ్రేడు, 1,04,866 గురు విద్యార్థులు "బి" గ్రేడు, 61,887 గురు విద్యార్థులు "సి" గ్రేడు, 1,08,093 గురు "డి" గ్రేడు సాధించినట్లు సమావేశంలో తెలిపారు.
ఈ సందర్భంగా కరోనా మహమ్మారి కారణంగా విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు గారు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలను ఏ విధంగా ఇవ్వాలనే విషయంలో ఇప్పటికే ప్రభుత్వం విధివిధానాలను రూపొందించిందని, ఇంటర్మీడియట్ పరీక్షలను రద్దు చేసిన సందర్భంలో మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి గారు గుర్తుచేస్తూ, వాటి ఆధారంగానే ద్వితీయ సంవత్సరం ఇంటర్ పరీక్ష ఫలితాలను ప్రకటిస్తున్నట్లు తెలిపారు. మొదటి సంవత్సరంలో సంబంధిత సబ్జెక్టు లో ఎన్ని మార్కులు విద్యార్థులకు వచ్చాయో ద్వితీయ సంవత్సరం కూడా సంబంధిత సబ్జెక్టులో అవే మార్పులను ఇచ్చినట్లు మంత్రిగారు తెలిపారు. ప్రాక్టికల్ విషయంలో మాత్రం విద్యార్థులందరికీ గరిష్ఠ స్థాయి మార్పులు ఇచ్చినట్లు వెల్లడించారు. గతంలో ఫెయిల్ అయిన సబ్జెక్టులకు మాత్రం పాస్ మార్కులు ఇచ్చి వారిని కూడా పాస్ చేశామని పేర్కొన్నారు.
మొదటి సంవత్సరం హాల్ టికెట్ నెంబర్ తో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలను అదికారి వెబ్ సైట్ ను సందర్శించి డౌన్లోడ్ చేసుకోవచ్చు..
ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలను డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపనలను పాటించండి.
1. అదికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
అదికారిక వెబ్సైట్ లింక్ : https://tsbie.cgg.gov.in/
అదికారిక వెబ్ పేజ్ క్రింది విధంగా ఓపెన్ అవుతుంది సంభందిత లింక్ పై క్లిక్ చేయండి.
మొదటి సంవత్సరం హాల్ టికెట్ నెంబర్ ను ఎంటర్ చేసి గెట్ రిసల్ట్ పై క్లిక్ చేయండి.
Comments
Post a Comment