TOSS 10th Inter Special Admission Schedule 2021-22 | Join and Freedom to Learn | Check more details here..
చదువుకోవాలనే ఆసక్తి ఉండి, మధ్యలో చదువు మానేసిన వారికి తెలంగాణ ప్రభుత్వం గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆసక్తి కలిగిన వారు ఇక్కడ అడ్మిషన్ పొందడం ద్వారా, నేరుగా 10వ తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ఏప్రిల్/ మే-2022 హాజరు కావచ్చు. ఆసక్తి కలిగిన వారి కోసం పూర్తి సమాచారం ఇక్కడ.
తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ, హైదరాబాద్. పదవ తరగతి ఇంటర్ ప్రవేశాలకు మరియొక సారి గడువు పొడిగించింది. ఈ నెల 14, తో గడువు ముగియనుండగా.. దానిని ఈ నెల 19 వరకు పొడిగించింది. ప్రవేశం పొందాలనుకునే అభ్యర్థులకు ఇది ప్రత్యేక ప్రవేశ షెడ్యూల్ గా ప్రకటించింది. అపరాధ రుసుముతో అభ్యర్థులు ఈ ప్రత్యేక ప్రవేశ షెడ్యూల్ ద్వారా 2021-22 విద్యా సంవత్సరానికి ప్రవేశం కోసం దరఖాస్తులు చేసుకోవచ్చు.
ఇతర ముఖ్యాంశాలు:
● రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఈ అవకాశం అందుబాటులో ఉంది.
● సంబంధిత జిల్లాలోని స్టడీ సెంటర్ ను ఎంపిక చేసుకోవచ్చు.
● ఇష్టమైన భాష, ఆసక్తి కలిగిన సబ్జెక్టులను ఎన్నుకొని, విద్యను పూర్తి చేయవచ్చు.
● అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, ఆధార్ కార్డు నెంబర్, మాతృభాష, కుల ధ్రువీకరణ పత్రం, గుర్తింపు చిహ్నాలు వివరాలతో మరియు వ్యక్తిగత పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సంతకం మొదలగునవి కలిగి దగ్గరలోని సార్వత్రిక విద్య ఈ సంస్థ ను సందర్శించి ప్రవేశాలు పొందవచ్చు.
● ఉచితంగా పాఠ్యపుస్తకాలను అందిస్తారు.
● వారాంతపు తరగతులు నిర్వహించి, పబ్లిక్ పరీక్షలకు ప్రిపరేషన్ గైడ్ అందిస్తారు.
● ఆసక్తి కలిగిన వారు పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి వివరాలను తనిఖీ చేయవచ్చు.
◆ అధికారిక వెబ్సైట్ లింక్: https://www.telanganaopenschool.org/
Comments
Post a Comment