Indian Navy 10+2(B.Tech) Cadet Entry Scheme Recruitment 2022 | Inter pass xan apply Online | Check vacancies and selection process here
ఇంటర్మీడియట్ విద్యార్హతతో, ఇండియన్ నేవీ ప్రవేశాలు, నాణ్యమైన ఇంజనీరింగ్ విద్య తో పాటు ఉన్నత స్థాయి ఉద్యోగం, కోసం ప్రవేశాలకు ప్రకటన:
హైరింగ్ ఆర్గనైజేషన్: ఇండియన్ నేవీ.
నోటిఫికేషన్: ఇండియన్ నేవీ 10+2(బీటెక్) క్యాడేట్ ఎంట్రీ స్కీమ్(పర్మినెంట్ కమిషన్) కోర్స్-జూలై 2022, కోసం భారతీయ ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను కోరుతూ ప్రవేశాలకు ప్రకటనను విడుదల చేసింది. ఇంటర్మీడియట్ పూర్తి చేసి, జేఈఈ మెయిన్స్-2021(బీఈ/ బీటెక్) కు హాజరైన అవివాహిత పురుష అభ్యర్థులు ఈ స్కీమ్ కు దరఖాస్తు చేయవచ్చు, దరఖాస్తులకు చివరి తేదీ:08.02.2022.
ఇండియన్ నేవీ క్యాడెట్ ఎంట్రీ 10+2(బీటెక్) స్కీమ్ యొక్క ప్రాధాన్యత, ప్రయోజనాలు, అర్హత ప్రమాణాలు, దరఖాస్తు విధానం, పరీక్ష విధానం.. తదితర వివరాలు ఇక్కడ చదవండి.
ఇండియన్ నేవీ 10+2(బీటెక్) క్యాడేట్ ఎంట్రీ స్కీమ్:
ఇంటర్మీడియట్ ఎంపీసీ పూర్తిచేసిన విద్యార్థుల కోసం ఇండియన్ నేవీ 10+2(బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీం పేరుతో ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ను విడుదల చేస్తుంది. తాజాగా ఈ సంవత్సరం కూడా(2022) లో ప్రారంభమయ్యే కోర్సు కోసం ప్రకటనను విడుదల చేసింది. ఈ కోర్సులకు ఎంపికైన అభ్యర్థులకు కేరళలోని నేవల్ అకాడమీ ఏజీమల లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లేదా మెకానికల్ బ్రాంచ్ లో 4 సంవత్సరాల ఇంజనీరింగ్ విద్యను ఉచితంగా చదివే అవకాశం లభిస్తుంది. మరియు విజయవంతంగా కోర్సును పూర్తి చేసుకున్న డిగ్రీ పట్టా తోపాటు సబ్ లెఫ్టినెంట్ హోదాతో నేవీలో ఉద్యోగ అవకాశాన్ని పొందవచ్చు. కాబట్టి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా దరఖాస్తులు చేయండి.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య : 35,
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
ఎడ్యుకేషన్ బ్రాంచ్ - 05,
ఎగ్జిక్యూటివ్ అండ్ టెక్నికల్ బ్రాంచ్ - 30..
అర్హత ప్రమాణాలు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన విద్యలో కనీసం 70 శాతం మార్కులతో ఉత్తీర్ణత కలిగి ఉండాలి. మరియు పదవ తరగతి/ 12వ తరగతిలో ఇంగ్లీష్ సబ్జెక్ట్ లో కనీసం 50 శాతం మార్కులు స్క్వేర్ చేయగలిగి ఉండాలి. అలాగే జేఈఈ మెయిన్స్ 2021(బీటెక్/ బిఈ) పరీక్షలకు హాజరై నిర్దేశిత శారీరక ప్రమాణాలను కలిగి ఉన్నవారు అర్హులు.
వయసు: జనవరి 2, 2003 నుండి జూలై 1, 2005 మధ్య జన్మించి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్.టి.ఏ) విడుదల చేసినటువంటి జేఈఈ-మెయిన్ ఆల్ ఇండియా కామన్ ర్యాంకు ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి, ఎస్.ఎస్.బి ఇంటర్వ్యూ మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక లు నిర్వహిస్తారు.
ఇంటర్వ్యూ: షార్ట్ లిస్ట్ అయినా అభ్యర్థులకు ఎస్ఎంఎస్ ఈమెయిల్ ద్వారా సమాచారం అందించి వీరికి బెంగళూరు, భోపాల్, కోల్కత్తా, విశాఖపట్టణంలో మార్చి - ఏప్రిల్ 2022 మధ్య ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 27.01.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 08.02.2022.
అధికారిక వెబ్సైట్: https://www.joinindiannavy.gov.in/
అధికారిక నోటిఫికేషన్: డౌన్లోడ్ చేయండి.
Comments
Post a Comment