TS Medical College Teaching Staff Recruitment 2021 | Apply online @dbs.telangana.gov.in | Check eligibility and more details here..
తెలంగాణ మెడికల్ కళాశాలలో టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 28, 2021 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు.. పూర్తి వివరాలు తెలుసుకోవడానికి పూర్తిగా చదవండి.
తెలంగాణ ప్రభుత్వం, డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, సుల్తాన్ బజార్, కోటి, హైదరాబాద్ నుండి అక్టోబర్ 14, 2021 న రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు అయినటువంటి 8 మెడికల్ కాలేజెస్/ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.
మెడికల్ కాలేజ్ వివరాలు:
1. ప్రభుత్వ వైద్య కళాశాల, వనపర్తి,
2. ప్రభుత్వ వైద్య కళాశాల, నాగర్ కర్నూల్,
3. ప్రభుత్వ వైద్య కళాశాల, మహబూబాబాద్,
4. ప్రభుత్వ వైద్య కళాశాల, భద్రాద్రి కొత్తగూడెం,
5. ప్రభుత్వ వైద్య కళాశాల, జగిత్యాల,
6. ప్రభుత్వ వైద్య కళాశాల, సంగారెడ్డి,
7. ప్రభుత్వ వైద్య కళాశాల, మంచిర్యాల్,
8. ప్రభుత్వ వైద్య కళాశాల, రామగుండం.. మొదలగునవి.
పైన తెలిపిన టువంటి 8 వైద్య కళాశాలలో ఆసక్తి కలిగిన అభ్యర్థులు ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
విభాగాల వివరాలు:
1. అనాటమీ,
2. సైకాలజీ,
3. బయో కెమిస్ట్రీ,
4. ఫార్మా కాలజీ,
5. పాథాలజీ,
6. మైక్రో బయాలజీ,
7. ఫారెన్సిక్ మెడిసిన్,
8. కమ్యూనిటీ మెడిసిన్,
9. జనరల్ మెడిసిన్,
10. డెర్మటాలజీ,
11. సైకియాట్రీ,
12. ఆర్థోపెడిక్,
13. అనస్తీసియాలాజి,
14. రేడియో డయాగ్నోసిస్,
15. ఎమర్జెన్సీ మెడిసిన్.. మొదలగు విభాగాలలో ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్.. పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
విద్యార్హత:
ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు వేరువేరుగా విద్యార్హతలను కలిగి ఉండాలి.. అన్నీ పోస్టులకు మొత్తంగా విద్యార్హతలను పరిశీలించినట్లయితే.. అభ్యర్థులు ఎంబిబిఎస్ ఉత్తీర్ణత కలిగి, సంబంధిత స్పెషలైజేషన్ ఈ విభాగంలో పోస్ట్‌గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీ (ఎండి/ ఎంఎస్) కళ్లను కలిగి ఉండాలి.. అలాగే సంబంధిత విభాగంలో టీచింగ్/ పరిశోధన అనుభవం కలిగి ఉండాలి. మరియు తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయి ఉండాలి.
ఎంపిక విధానం: వచ్చిన దరఖాస్తులను షార్ట్‌లిస్ట్ చేసి, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు..
ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి జీతాల వివరాలు:
💧ప్రొఫెసర్ పోస్టులకు: రూ.1,90,000/-
💧అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు: రూ.1,50.000/-
💧అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు: రూ.1,25,000/-.. ఇలా ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు..
దరఖాస్తు విధానం: అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 28.10.2021.
అధికారిక వెబ్సైట్: https://dme.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
Comments
Post a Comment