ICAR Technician Recruitment 2021 || SSC Passed may Apply Online || Check Selection Process here..
పదవ తరగతి పాసైన విద్యార్థులకు శుభవార్త!
భారత వ్యవసాయ పరిశోధన సంస్థ టెక్నిషియన్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.
భారత వ్యవసాయ పరిశోధన సంస్థ 641 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి తాజాగా ప్రకటనను విడుదల చేసింది. పే స్కేల్ లెవెల్-3 ప్రకారం రూ.21,700/- తో ఇతర అలవెన్సులు చెల్లిస్తారు. దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 18 నుండి ప్రారంభమైంది, దరఖాస్తులకు చివరి తేదీ 10 జనవరి 2021. కానీ దరఖాస్తు తేదీ ను తాజాగా 20.01.2022 వరకు పొడిగిస్తూ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన మహిళ, పురుష భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా సమర్పించవచ్చు. దరఖాస్తులు సందర్శించడానికి ముందు, అర్హత ప్రమాణాలను తెలుసుకోవడానికి అధికారిక నోటిఫికేషన్ ను చదవండి.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 641,
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
అన్ రిజర్వుడ్ లకు 286,
ఈ డబ్ల్యూ ఎస్ లకు 61,
ఎస్సీలకు 93,
ఎస్టి లకు 68,
OBC నాన్ క్రిమిలేయర్ లకు 133,
మాజీ సైనికులకు 8,
దివ్యాంగులకు 6.. ఇలా మొత్తం 641 పోస్టులను ఈ నోటిఫికేషన్ ఆధారంగా భర్తీ చేయనున్నారు.
విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ నుండి పదవ తరగతి/ తత్సమాన విద్యార్హత సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు చేయవచ్చు.
వయసు: జనవరి 10 2022 నాటికి 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
అధిక వయసు కలిగిన రిజర్వేషన్ కేటగిరీల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు అర్హులు, పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
దరఖాస్తు ఫీజు: ఆన్ రిజర్వుడ్/ OBC నాన్ క్రిమిలేయర్/ ఈడబ్ల్యూఎస్ లకు 1000/-.
ఎస్సీ ఎస్టీ మాజీ సైనికులు దివ్యాంగులు మరియు మహిళా అభ్యర్థులకు ఎగ్జామినేషన్ ఫీజు మినహాయించారు, వారు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించే దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష ఆధారంగా ఎంపిక లు నిర్వహిస్తారు.
పరీక్ష సెంటర్లు: రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు పరీక్ష సెంటర్లు ఆంధ్ర, తెలంగాణ ప్రధాన జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేశారు.
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 18.12.2021,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 20.01.2022
అధికారిక వెబ్సైట్: https://www.iari.res.in/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్ అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.
Comments
Post a Comment