Telangana ePASS Online Registration process live demo | @eLearningBADI.in
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రి మెట్రిక్ స్కాలర్షిప్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే విధానం.
★ ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ దరఖాస్తు చేసుకోవడానికి ఎలాంటివి ఐడి పాస్వర్డ్ అవసరం లేదు.
★ 5 నుండి పదవ తరగతి వరకు చదువుతున్న ఎస్సీ ఎస్టీ బిసి మరియు వికలాంగ అభ్యర్థులు రిజిస్టర్ అవ్వడానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి.
★ ఇక్కడ రెండు సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
1. కొత్తగా నమోదు చేసుకున్న వారి కోసం.
2. ఇప్పటికే రిజిస్టర్ అయినటువంటి వారు రెన్యువల్ చేసుకోవడానికి సంబంధించింది.
★ కొత్తగా నమోదు చేసుకున్న ఇటువంటి వారు రిజిస్ట్రేషన్ లింక్ పై క్లిక్ చేయండి.
■ ఈ ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ దరఖాస్తులకు అర్హత ప్రమాణాలు:
◆ విద్యార్థులు ఎస్సీ ఎస్టీ బిసి వర్గాలకు చెందిన వారై ఉండాలి.
◆ విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్న వారికి 1,50,000/- మించకుండా పట్టణ ప్రాంతంలో నివసిస్తున్న వారికి 2,00,000/- మించకుండా ఉండాలి.
◆ ప్రతి విద్యా సంవత్సరం చివరలో విద్యార్థి యొక్క హాజరు శాతం 75% ఉన్నట్లయితే పునరుద్ధరణ కోసం విద్యా సంవత్సరానికి ప్రమోట్ చేయబడతారు.
◆ పి స్కాలర్షిప్ పథకం కింద ప్రతి సంవత్సరం,
◆ 5 నుండి 8 వ తరగతి చదువుతున్న బాలికలకు ₹.15,000/-
◆ 5 నుండి 8 వ తరగతి చదువుతున్న బాలురకు ₹.1,000/-
◆ 9 నుండి పదవ తరగతి బాలురు మరియు బాలికలకు ₹.3,000/-అందిస్తారు.
◆ ఈ ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ దరఖాస్తు చేసుకోవడానికి విద్యార్థులు వ్యక్తిగత, పాఠశాల, బ్యాంక్, చిరునామా, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలతో, ఫోటో, బ్యాక్ పాస్ బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్ లను కలిగి ఉండాలి.
◆ దరఖాస్తుదారు దివ్యాంగుల అయితే, సదరన్ కటింగ్, ప్రస్తుత సంవత్సరం చదువుతున్న బోనఫైడ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
అధికారిక వెబ్సైట్: https://telanganaepass.cgg.gov.in/
Comments
Post a Comment