Walk in Interview - JOB Opportunity - 2022 | నిరుద్యోగ యువతకు వాక్-ఇన్-ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగ కల్పన | పూర్తి వివరాలు ఇవే..
నిరుద్యోగ యువకులకు శుభవార్త!
జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఈ జి యమ్ యమ్ ఖమ్మం వారి ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి వివిధ మల్టీనేషనల్ కంపెనీలు ఈనెల 12వ తేదీన నేరుగా ఇంటర్వ్యూలను నిర్వహించి, ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి, అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువతను ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తూ ప్రకటనను విడుదల చేసింది.
ఖమ్మం జిల్లాలోని వివిధ ప్రైవేటు సంస్థల నందు నేరుగా ఉపాధి అవకాశాలు పొందడానికి జిల్లాలోని నిరుద్యోగ యువత ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.
పోస్టుల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య : 141,
విభాగాల వారీగా ఖాళీలు:
◆ సేల్స్ ఆఫీసర్ - 100,
◆ జూనియర్ రిలేషన్ ఎగ్జిక్యూటివ్ - 10,
◆ సేల్స్ కన్సల్టెంట్ - 21,
◆ ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ - 10.. మొదలగునవి.
కంపెనీల వివరాలు:
◆ ముత్తుట్ ఫైనాన్స్ లిమిటెడ్.
◆ భారత్ హోండై ఖమ్మం
◆ శ్రీ అన్నదాత అర్గోనిక్ మేన్యూర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఖమ్మం.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి 10వ తరగతి/ తత్సమాన/ ఇంటర్మీడియట్/ ఏదైనా విభాగంలో డిగ్రీ/ ఎంబీఏ మొదలగు విద్యార్హత కలిగిన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
వయో-పరిమితి:
19 నుండి 35 సంవత్సరాలకు మించకూడదు.
గౌరవ వేతనం: పోస్టులను బట్టి ₹.10,000/- నుండి ₹.15,000/-ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు.
ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ (ఉద్యోగం చేయు ప్రదేశం) : ఖమ్మం జిల్లాలోని అన్ని మండలాలను నందు.
ఎంపిక విధానం:
ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఎంపికలు ఇంటర్వ్యూల ఆధారంగా నిర్వహిస్తున్నారు..
★ ఆసక్తి కలిగిన అభ్యర్థులు నేరుగా తాజా బయోడేటా ఫామ్ తో విద్యార్హత ధ్రువపత్రాల కాపీలను జత చేసి, ఈ నెల 12న (12.07.2022) ఉదయం 10:30 కు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ టి.టి.డి.సి కార్యాలయం ఖమ్మం నందు హాజరు కాగలరు.
ఇంటర్వ్యూ సమయంలో సమర్పించవలసిన ధృవపత్రాలు కాపీల వివరాలు:
◆ SSC ఆపై విద్యార్హతల మార్క్ మెమోలు.
◆ తాజా బయో డేటా లేదా రెజ్యూమ్.
◆ రెండు పాస్ పోర్ట్ సైజు ఫోటోలు.
◆ ఆధార్ కార్డ్.
◆ బ్యాంక్ బుక్ జిరాక్స్.
◆ పాన్ కార్డ్.. మొదలగునవి.
ఇంటర్వ్యూ తేదీ: 12.07.2022,
సమయం: ఉదయం 10:30 నుండి.
వేదిక: ఇల్లందు క్రాస్ రోడ్డు నందు గల జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, టి.టి.డి.సి కార్యాలయం ఖమ్మం.
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఈ ప్రకటనపై సందేహాల నివృత్తి కోసం మరియు పూర్తి సమాచారం కోసం ఈ నెంబర్ 8977631851 ను సంప్రదించండి
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment