డిగ్రీ తో శాశ్వత ఉద్యోగాలు: సీడ్స్ కార్పొరేషన్ లిమిటెడ్ లో ఉద్యోగాలు NSC Opening Permanent Positions Apply here Graduates Don't miss..
డిగ్రీ అర్హతతో, సీడ్స్ కార్పొరేషన్ లిమిటెడ్ శాశ్వత పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ.
భారత ప్రభుత్వ మినీ రత్న కంపెనీ కు చెందిన, నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (NSC) న్యూఢిల్లీ, భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించి పోటీ పడవచ్చు.. దివ్యాంగులకు పోస్టులను కేటాయించారు గమనించగలరు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం, ఖాళీల వివరాలు, విద్య విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, మొదలగు పూర్తి సమాచారం మీకోసం ఇక్కడ.
పోస్టుల వివరాలు :- మొత్తం పోస్టుల సంఖ్య :: 89.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
- జూనియర్ ఆఫీసర్-I (లీగల్) - 04,
- జూనియర్ ఆఫీసర్-I (విజిలెన్స్) - 02,
- మేనేజ్మెంట్ ట్రైయినీ (మార్కెటింగ్) - 15,
- మేనేజ్మెంట్ ట్రైయినీ (ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్) - 01,
- మేనేజ్మెంట్ ట్రైయినీ (సివిల్ ఇంజనీరింగ్) - 01,
- ట్రైయినీ (అగ్రికల్చర్) - 40,
- ట్రైయినీ (మార్కెటింగ్) - 06,
- ట్రైయినీ (క్వాలిటీ కంట్రోల్) - 03,
- ట్రైయినీ (స్టేనియోగ్రాఫర్) - 05,
- ట్రైయినీ అగ్రి. సెక్టార్ లు - 12.. మొదలగునవి.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బి.ఎస్సి/ బీటెక్/ ప్రొఫెషనల్ డిగ్రీలను అర్హతలుగా కలిగి ఉండాలి.
- స్టెనోగ్రాఫర్ పోస్టులకు ఇంగ్లీష్/ హిందీ మాధ్యమాల్లో కంప్యూటర్ పై నిమిషానికి 80 పదాలు టైప్ చేయగల సామర్థ్యం కలిగి ఉండాలి.
- షార్ట్ లిస్టు అయిన అభ్యర్థులకు ఫైనల్ చేస్తారు.
వయో పరిమితి :
- 25.09.2023 నాటికి 27 సంవత్సరాల పూర్తిచేసుకుని 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో 3 నుండి 10 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాలకు ఎంపికలు రాత పరీక్ష/ ధృవ పత్రాల పరిశీలన/ ఇంటర్వ్యూల ఆధారంగా ఉంటుంది.
- రాత పరీక్ష కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి బేసిక్ పే రూ.22,000 - 77,000/-అన్ని అలవెన్స్ లతో కలిపి దాదాపుగా రూ.37,224 - 55,680/- వరకు చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు ::
- అన్ రిజర్వ్డ్ కేటగిరి/ ఈడబ్ల్యూఎస్/ ఓబిసి/ మాజీ-సైనికులకు రూ. 500/-.
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
అధికారిక వెబ్సైట్ :: https://www.indiaseeds.com/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 28.08.2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 25.09.2023 వరకు.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్షలు నిర్వహించు తేది :: అక్టోబర్ 10, 2023 (తాత్కాలిక)
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment