TS Best Available School Admission 2022 Notification Released. Check Eligibility here..
తెలంగాణ ప్రభుత్వము
పెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ, భద్రాద్రి కొత్తగూడెం
పత్రికా ప్రకటన
2021-22 విద్యా సంవత్సరములలో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పధకము కింద రెసిడెన్షియల్ నాన్ రెసిడెన్షియల్ (డే స్కాలర్స్) 1వ తరగతి లో ఖాళీగా ఉన్న (02) మరియు రెసిడెన్షియల్ (హాస్టలర్స్, 5 వ తరగతి లో ఖాళీగా ఉన్న (04) సీట్లు ప్రవేశమును పొందుటకుగాను దరఖాస్తు ఆహ్వానించనైనది.
కావలసిన అర్హతలు:-
1. కుటుంబములో ఒక విద్యార్ధినీ, విద్యార్ధులకు మాత్రమే ఈ పదకము క్రింద అర్హులు.
2. తల్లిదండ్రుల వార్షిక ఆదాయము గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారకి రూ.1,50,000/-లకు మరియు పట్టణ ప్రాంతాలకు చెందిన వారకి రూ.2,00,000/-లకు మించరాదు.
3. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన విద్యార్ధినీ, విద్యార్ధులకు మాత్రమే అర్హులు.
4. విద్యార్ధినీ, విద్యార్ధుల యొక్క వయస్సు 5 సంవత్సరముల నుండి 6 సంవత్సరముల మద్యన ఉండవలెను
తప్పక చదవండి :: పార్ట్ టైమ్ టీచర్/లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. పూర్తి వివరాలివే..
దరఖాస్తులకు చివరి తేదీ: 24.12.2021
దరఖాస్తుతో జతచేయవలసిన ధృవపత్రములు (జిరాక్స్ కాపీలు)
1. పుట్టిన తేదీ ధృవీకరణ పత్రము.
2. రేషన్ కార్డు/ ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ.
3. మీ-సేవ ద్వరా జారీ చేయబడిన కుల, ఆదాయ మరియు నివాసం ధృవీకరణ పత్రము.
4.(2) పాస్ పోర్ట్ సైజు కలర్ ఫోటోలు.
5. 1వ తరగతి ప్రవేశం కొరకు U.K.G చదివినా స్కూల్ బోనఫైడ్ సర్టిఫికేట్ మరియు ప్రోగ్రెస్ కార్డు జతచేయివలెను.
6. 5వ తరగితి ప్రవేశం కొరకు 4వ తరగతి చదివినా స్కూల్ బోనఫైడ్ సర్టిఫికేట్ మరియు ప్రోగ్రెస్ కార్డు జతచేయివలెను
ఆసక్తి గల విద్యార్ధినీ, విద్యార్ధుల దరఖాస్తు ఫారం లను కొత్తగూడెం, పాల్వంచ మరియు భద్రాచలం సహాయ పెడ్యూల్డ్ కులాల శాఖ అధికార వారి కార్యాలయములలో గాని మరియు జిల్లా పెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ అధికారి వారి కార్యాలయము, భద్రాద్రి కొత్తగూడెం నందు నుండి గాని పొంది పూర్తిచేసిన దరఖాస్తు ఫారంలను పెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ అధికార వారి కార్యాలయము, భద్రాద్రి కొత్తగూడెం నందు 25.12.2021 సాయంత్రం గం.5.00 లోపు సమర్పించవలయును.
గమనిక:- పూర్తిచేసిన దరఖాస్తు ఫారముతో పై తెల్పబడిన ధృవీకరణ పత్రము అన్నియు జతచేసిన వాటిని మాత్రమే పరిగణనలోనికి తీసుకొనబడును. లేనిచో అట్టి దరఖాస్తు ఫారములను అర్హత లేనిదిగా భావించబడును. కావున ఇట్టి విషయమును విద్యార్ధినీ, విద్యార్ధులకు మరియు వారి తల్లిదండ్రులు గమనించి సహకరించగలరు.
నిరాకరణ : మేము elearningbadi.in లో పోస్ట్ చేసే సమాచారం ఖచ్చితమైనదని నిర్ధారించడానికి ప్రయత్నిస్తాము. మా ఉత్తమ ప్రయత్నాలు ఉన్నపటికి, కొన్ని కంటెంట్ లో లోపాలు ఉండవచ్చు. మీరు మమ్మల్ని విశ్వశించవచ్చు. కానీ దయచేసి మీ స్వంత తనిఖిలను కూడా నిర్వహించండి.
🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్ అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.
Comments
Post a Comment