NLC Recruitment 2023 | Diploma/ Degree తో 626 అప్రెంటిస్ ఉద్యోగాలు | Register here..
![]() |
Diploma/ Degree తో 626 అప్రెంటిస్ ఉద్యోగాలు |
డిగ్రీ డిప్లమా తో అప్రెంటిస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త!
గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ టెక్నికల్ (డిప్లమా) విభాగాల్లో 318+308=626 సీట్ల భర్తీకి ప్రకటన..
భారత ప్రభుత్వం బొగ్గు మంత్రిత్వ శాఖకు చెందిన, చెన్నైలోని నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్(NLC India Limited), గ్రాడ్యుయేషన్/ డిప్లమో విభాగాల్లో అప్రెంటిస్ సీట్ల భర్తీకి 2020/2021/2022 ల్లో అర్హత సాధించిన అభ్యర్థుల నుండి ఒక(1) సంవత్సరం పాటు అప్రెంటిస్ శిక్షణ లో అందించడానికి, ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, లక్షద్వీప్, తమిళనాడు, తెలంగాణ, పుదుచ్చేరి.. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి దరఖాస్తులను సమర్పించవచ్చు.. ఎలాంటి రాతపరీక్ష లేకుండా! అభ్యర్థులు అకడమిక్/ టెక్నికల్ విద్యార్హతల్లో కనపరిచిన ప్రతిభ ఆధారంగా ఈ సీట్లను భర్తీ చేయనున్నారు.. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం పూర్తి వివరాలతో ఒక సమాచారం దిగువన..
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 626,
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ విభాగంలో..
1. మెకానికల్ ఇంజనీరింగ్ - 73,
2. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ - 81,
3. సివిల్ ఇంజనీరింగ్ - 25,
4. ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ఇంజనీరింగ్ - 12,
5. కెమికల్ ఇంజనీరింగ్ - 09,
6. మైనింగ్ ఇంజనీరింగ్ఇంజనీరింగ్ - 42,
7. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ - 52,
8. ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ - 10,
9. ఫార్మసీ - 14.. మొదలగునవి.
గ్రాడ్యుయేట్ విభాగంలో మొత్తం - 318.
టెక్నీషియన్ (డిప్లమా) అప్రెంటిస్ విభాగంలో..
1. మెకానికల్ ఇంజనీరింగ్ - 83,
2. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ - 82,
3. సివిల్ ఇంజనీరింగ్ - 49,
4. ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ఇంజనీరింగ్ - 10,
5. మైనింగ్ ఇంజనీరింగ్ఇంజనీరింగ్ - 35,
6. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ - 40,
7. ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ - 09.. మొదలగునవి.
టెక్నికల్ డిప్లమా విభాగంలో మొత్తం - 308.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి ఇంజినీరింగ్/ టెక్నాలజీ విభాగంలో గ్రాడ్యుయేషన్, బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ అర్హత పరీక్షలో 2020/2021/2022 ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి:
అప్రెంటిస్ నియమ నిబంధనల ప్రకారం వయోపరిమితి ఉంటుంది.
✓ అభ్యర్థులు దరఖాస్తు తేదీ నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి.
ఎంపిక విధానం:
✓ ఈ ప్రవేశాలకు ఎలాంటి రాత పరీక్ష లేదు.
✓ అభ్యర్థులు అకడమిక్/ టెక్నికల్ విద్యార్హతలు కనపరిచిన ప్రతిభ ఆధారంగా షార్ట్లిస్ట్ చేసి, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
గౌరవ వేతనం:
శిక్షణ కాలంలో ఎంపికైన అభ్యర్థులకు (1) సంవత్సరం పాటు శిక్షణ లను అందిస్తూ శిక్షణా కాలంలో Stipend రూపంలో ప్రతి నెల ఈ క్రింది విధంగా జీతంగా చెల్లిస్తారు.
✓ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ లకు రూ.15,029/-.
✓ టెక్నీషియన్ డిప్లమా అప్రెంటిస్ లకు రూ.12,524/-.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :: లేదు.
అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
✓ నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తిపరిచే అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ముందుగా అధికారిక వెబ్సైట్ను సందర్శించాలి.
✓ అధికారిక వెబ్ సైట్ లింక్ :: https://www.nlcindia.in/
✓ తదుపరి మెయిన్ మెనూ లోని Careers లింక్ పై క్లిక్ చేయండి.
✓ ఇప్పుడు మీరు Careers పేజీలోకి రీ డైరెక్ట్ అవుతారు.
✓ తదుపరి Trainees & Apprentices లింక్ పై క్లిక్ చేయండి.
✓ దరఖాస్తు పేజీ ఓపెన్ అవుతుంది.
✓ సంబంధిత అర్హత, వ్యక్తిగత.. వివరాలను నమోదు చేస్తూ, దరఖాస్తు విజయవంతంగా సమర్పించండి.
✓ దరఖాస్తులు డౌన్లోడ్ చేసుకొని, అర్హత ధ్రువపత్రాల కాపీలను జత చేసి దిగువన చిరునామాకు పంపించాలి.
దరఖాస్తు చిరునామా :
The General Manager,
Learning and Development Centre,
N.L.C India Limited.
Neyveli - 607803.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 23.01.2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 31.01.2023 సాయంత్రం 05:00 గంటల వరకు.
ఆన్లైన్ దరఖాస్తును సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలను జత చేసి పోస్టు ద్వారా పంపించడానికి చివరి తేదీ :: 06.02.2023 సాయంత్రం 05:00 గంటల ముందు.
సర్టిఫికేట్ వెరీఫికటివం నిర్వహించు తేదీ :: 22.02.2023 నుండి 28.02.2023 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://www.nlcindia.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment