డిగ్రీ ఐటిఐ విద్యార్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు | టెక్నీషియన్ ఇంగ్రేవర్ అసిస్టెంట్ విభాగాల్లో ఖాళీలు | పూర్తి వివరాలను ఇక్కడ తనిఖీ చేయండి.
నిరుద్యోగులకు శుభవార్త!.
భారత ప్రభుత్వానికి చెందిన సెక్యూరిటీ ప్రింటింగ్ మరియు మింటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ డిగ్రీ/ ఐటిఐ/ ఫైన్ ఆర్ట్స్... విద్యార్హతలతో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను మార్చి 1, 2022 వరకు సమర్పించవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు పూర్తి వివరాలు తెలుసుకోవడానికి నోటిఫికేషన్ ముఖ్య సమాచారమైన ఖాళీల వివరాలు, విద్యార్హత, వయస్సు, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం.. ఈ క్రింది విధంగా ఉన్నాయి.
హైరింగ్ ఆర్గనైజేషన్: సెక్యూరిటీ ప్రింటింగ్ & మింటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్.
నోటిఫికేషన్: SPMCIL భారత ప్రభుత్వానికి చెందిన, ముంబైలోని 'సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్' హైదరాబాద్ తో సహా తొమ్మిది యూనిట్లను కలిగి ఉన్నది. డిగ్రీ/ ఐ టి ఐ/ విద్యార్హతతో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 15.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. సెక్రటేరియల్ అసిస్టెంట్ - 01,
2. జూనియర్ బులిటెన్ అసిస్టెంట్ - 01,
3. ఇంగ్రేవర్ - 06,
4. జూనియర్ టెక్నీషియన్ - 7..
విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి, కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతో, కంప్యూటర్ పరిజ్ఞానం, స్టెనియోగ్రఫీ, టైప్ రైటింగ్ స్కిల్స్ తో సంబంధిత విభాగంలో ఐటిఐ ట్రేడ్ సర్టిఫికెట్ (NCVT) నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్ నుండి కలిగి ఉండాలి.
వయసు:
● మార్చి 1 2022 నాటికి 25 నుండి 28 సంవత్సరాలకు మించకూడదు.
● అధిక వయోపరిమితి కలిగిన వారికి సడలింపులు వర్తిస్తాయి. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
● పై అన్ని రకాల పోస్టులకు ఎంపికలు రాత పరీక్ష ఆధారంగా నిర్వహిస్తారు.
● ఈ పరీక్షలో ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్ రూపంలో ఉంటాయి.
● పరీక్ష పేపర్ హిందీ మరియు ఇంగ్లీష్ మాధ్యమంలో ఉంటుంది.
దరఖాస్తు ఫీజు:
● జనరల్ అభ్యర్థులకు ₹.600/-.
● ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు పరీక్ష ఫీజు మినహాయించారు.
● ఇంటిమేషన్ చార్జీల కోసం 200 రూపాయలు చెల్లించాలి.
దరఖాస్తు విధానం:
● దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
● ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 31.01.2022
● ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 01.03.2022
అధికారిక వెబ్సైట్: https://igmmumbai.spmcil.com/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి డైరెక్ట్ లింక్: https://ibpsonline.ibps.in/ & https://igmmumbai.spmcil.com/
🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్ అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.
Comments
Post a Comment