NIRDPR Recruitment 2022 | డిగ్రీ అర్హతతో పంచాయితీ రాజ్ హైద్రాబాద్ పలు ఉద్యోగాల భర్తీకి ప్రకటన | రాత పరీక్ష లేదు | ఖాళీల వివరాలు, ఎంపిక విధానం ఇక్కడ తనిఖీ చేయండి..
పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ హైదరాబాద్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు తో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల:
హైరింగ్ ఆర్గనైజేషన్ : నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ & పంచాయతీ రాజ్.
NIRDPR-నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ & పంచాయతీ రాజ్, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడానికి తాజాగా నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఇక్కడ మొత్తం 25 విభాగాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి, గ్రాడ్యుయేట్ అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు చేయవచ్చు.
పోస్టుల వివరాలు:
ముఖ్య విభాగాలు:
1. అసిస్టెంట్ రిజిస్ట్రార్
2. డైరెక్టర్(ఫైనాన్స్)
3. అసిస్టెంట్ ఫైనాన్సియల్ అడ్వైజర్ & పే అండ్ అకౌంట్ ఆఫీసర్
4. అకౌంట్ ఆఫీసర్
5. సెక్షన్ ఆఫీసర్
6. జూనియర్ ఇంజనీర్ (సివిల్)
7. ప్రాజెక్ట్ ఆఫీసర్
8. ప్రోగ్రామ్ ఆఫీసర్
9. మేనేజర్
10. అసిస్టెంట్ మేనేజర్.. మొదలగునవి.
విద్యార్హత: వివిధ రకాల పోస్టులకు వివిధ రకాల విద్యార్హతలను నోటిఫికేషన్లో పేర్కొన్నారు. గ్రాడ్యుయేషన్/ పోస్ట్ గ్రాడ్యుయేషన్ తో సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న అభ్యర్థులు అర్హులు.
వయసు: 56 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి.
దరఖాస్తు ఫీజు: లేదు.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థుల కు ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపికలు చేపడతారు.
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ
💧ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టులకు చివరి తేదీ: 10.02.2022.
💧అసిస్టెంట్ రిజిస్ట్రార్, జూనియర్ ఇంజనీర్, ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉద్యోగాలకు చివరితేదీ: 25.02.2022.
💧ప్రాజెక్ట్ ఆఫీసర్, ప్రోగ్రామ్ ఆఫీసర్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు చివరితేదీ: 03.03.2022.
అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు పూర్తి వివరాలు తెలుసుకోవడానికి నోటిఫికేషన్ చదవండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి:
1. అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి. http://nirdpr.org.in/
2. మెయిన్ పేజీ లోనే జాబ్ వేకెన్సీ లింక్ పై క్లిక్ చేయండి.
3. వివిధ రకాల పోస్టులకు సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ లింక్ పై క్లిక్ చేయండి.
4. మొత్తం 25 రకాల పోస్టులు ఈ పేజీలో అందుబాటులో ఉంటాయి. అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగలనా అభ్యర్థులు రిజిస్టర్& అప్లై లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తులు సమర్పించండి.
5. మొదటిగా రిజిస్ట్రేషన్ అవ్వాలి, తదుపరి లాగిన్ వివరాలతో దరఖాస్తుల ఆహ్వానం ఆన్లైన్లో సమర్పించాలి.
అధికారిక నోటిఫికేషన్: చదవండి /డౌన్లోడ్ చేయండి.
అధికారిక వెబ్సైట్: http://career.nirdpr.in/
🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్ అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.
Comments
Post a Comment