నేషనల్ హెల్త్ మిషన్ తెలంగాణ మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | రెండు జిల్లాల నుండి నోటిఫికేషన్లు విడుదల | వివరాలివే.
నేషనల్ హెల్త్ మిషన్ తెలంగాణ, రెండు జిల్లాల నుండి వివిధ మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది, ఎం బి బి ఎస్ మరియు సంబంధిత స్పెషలైజేషన్లో ఈ కోర్సు చేసిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేయవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ మార్చి 5,నుండి ప్రారంభమైనది, దరఖాస్తులకు చివరి తేదీ మార్చి 9 2022.
నోటిఫికేషన్ 1: జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం జోగులాంబ గద్వాల్ ఒప్పంద ప్రాతిపదికన మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఆఫ్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
ఖాళీల వివరాలు:
విభాగాల వారీగా ఖాళీలు:
మెడికల్ ఆఫీసర్ ఆయుర్వేదిక్ లో - 4,
మెడికల్ ఆఫీసర్ నేచురోపతి లో - 1,.. ఇలా మొత్తం ఐదు ఖాళీలను ప్రకటించారు.
విద్యార్హత: సంబంధిత విభాగంలో స్పెషలైజేషన్ కలిగి ఉన్న అభ్యర్థులు ఆఫ్లైన్ దరఖాస్తులు చేయవచ్చు.
వయసు: 18 సంవత్సరాల నుండి 30 నాలుగు సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ను ఇక్కడ క్లిక్ చేసి చదవండి.
అధికారిక వెబ్సైట్: https://gadwal.telangana.gov.in/
నోటిఫికేషన్ 2: జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం వరంగల్ జిల్లా నుండి నేషనల్ హెల్త్ మిషన్ కింద జిల్లాలోని 19 పల్లె దవాఖానాల్లో మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన.
అర్హత ప్రమాణాలు :: ఎంబిబిఎస్ విద్యార్హతతో 18 నుండి 44 సంవత్సరాల మధ్య వయసున్న అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించవచ్చు.
అధికారిక నోటిఫికేషన్: ఇక్కడ క్లిక్ చేసి చదవండి.
అధికారిక వెబ్సైట్: https://warangal.telangana.gov.in/
Comments
Post a Comment