ANGRAU Agri Polycet - 2022 Results Out | అగ్రి పాలిసెట్ - 2022 ఫలితాలు విడుదల..
ఆచార్య ఎన్.జి రంగారావు వ్యవసాయ యూనివర్సిటీ 2022-23 విద్యా సంవత్సరానికి, అగ్రి పాలీసెట్ ప్రవేశాలకు సంబంధించిన ప్రవేశ పరీక్ష ఫలితాలను తాజాగా ఈ రోజు విడుదల చేశారు. ప్రవేశాలకు మే 18వ తేదీన ప్రవేశ ప్రకటన విడుదల చేసింది. Agri polycet - 2022-23 ప్రవేశాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మే 18వ తేదీ నుండి ప్రారంభమై జూన్ 1న ముగిసింది. అర్హత ప్రవేశ పరీక్షను జులై 1వ తేదీన ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రంలోని పలు కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించింది. నోటిఫికేషన్లో పేర్కొన్న ఆధారంగా ఫలితాలను తాజాగా 08.07.2022 ఉదయం 11:00 గంటలకు విడుదల చేసింది.
ANGRAU Agri Polycet -2022 ఫలితాలను తనిఖీ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి:
◆ ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
◆ అధికారిక వెబ్ సైట్ లింక్: https://angrau.ac.in/
◆ తదుపరి Home పేజీలో Events/Flash News ఈ విభాగంలోనే అగ్రి polycet 2022 ఆన్లైన్ అప్లికేషన్స్ లింక్ పై క్లిక్ చేయండి.
◆ సంబంధిత హాల్టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్లను.. నమోదుచేసి Download Provisional Rank Card లింక్ పై క్లిక్ చేయండి.
◆ సంబంధిత, ఫలిత ఫైల్ ఓపెన్ అవుతుంది.
◆ భవిష్యత్ కార్యాచరణ కోసం తీసుకొని భద్రపరుచుకోండి.
అధికారిక వెబ్సైట్: https://angrau.ac.in/
ఇప్పుడే ఫలితాలను డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment