SJVN Recruitment 2023: బీఈ బీటెక్ తో ఫీల్డ్ ఇంజనీర్ ఉద్యోగాలు | ప్రారంభ జీతం : 80,000 | Apply 50 Field Engineer Posts here..
బీఈ, బీటెక్ తో ఫీల్డ్ ఇంజనీర్ ఉద్యోగాలు | రాత పరీక్ష లేదు | ప్రారంభ జీతం : 80,000 | దరఖాస్తు చివరితేదీ : 24.04.2023 | నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ..
భారత ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వశాఖకు చెందిన ఎస్.జె.వి.ఎన్ లిమిటెడ్, మినీ రత్న క్యాటగిరి-1, ఫీల్డ్ ఇంజనీర్ విభాగంలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి భారతీయ అభ్యర్ధుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తు నోటిఫికేషన్ జారీచేసింది. ఎస్.జె.వి.ఎన్ లిమిటెడ్ అధికారిక నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తులను 07-04-2023 నుండి 28-04-2023 వరకు సమర్పించవచ్చు. అర్హత శక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, గౌరవ వేతనం, ఎంపిక విధానం మొదలగునవి మీకోసం.
దరఖాస్తు చేశారా?. జిల్లా సహకార బ్యాంక్ లో శాశ్వత అసిస్టెంట్, క్లర్క్, మేనేజర్ ఉద్యోగాలు.ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య :- 50.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
- ఫీల్డ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) - 12,
- ఫీల్డ్ ఇంజనీర్ (మెకానికల్) - 14,
- ఫీల్డ్ ఇంజనీర్ (సివిల్) - 24.. మొదలగునవి.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
- అలాగే.. సంబంధిత పోస్టులను అనుసరించి కనీసం 6 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల వరకు పని అనుభవం కలిగి ఉండాలి.
- అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు.
దరఖాస్తు చేశారా?. పదో తరగతి తో బొగ్గు గనుల్లో బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ SC ST OBC లకు బంపర్ అవకాశం..
వయోపరిమితి :
- ధరఖాస్తు చేసుకునేనాటికి అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల మద్య వయస్సు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం :
- పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికలను నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :
- పోస్టులను అనుసరించి ఎంపికైన అభ్యర్థులకు రూ.80,000/- నుండి రూ.1,18,000/- ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
తప్పక చదవండి: కేంద్రీయ విద్యాలయా ప్రవేశాలు KVS Admission (2023-24) for I - XI Class | Register here..
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- జనరల్ అభ్యర్థులకు రూ.590/-.
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ :: 28-04-2023 వరకు.
అధికారిక వెబ్సైట్ : https://sjvn.nic.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే దరఖాస్తులను సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment