TTWREIS Sport school Admission into 5th Class || తెలంగాణ గిరిజన స్పొర్ట్స్ స్కూల్ తో 5వ తరగతి ప్రవేశాలు..
తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ హైదరాబాద్
ప్రవేశ ప్రకటన
తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 2021-22 విద్యా సంవత్సరానికి 02-స్పోర్ట్స్ పాఠశాలల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల.
విద్యార్హత:
తెలంగాణ రాష్ట్రంలోని వివిధ రంగాలపై ఆసక్తి ఉన్న విద్యార్థులందరూ (బాలురు& బాలికలు), తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, మోడల్ స్కూల్, ఆశ్రమ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు ఏయిడెడ్ పాఠశాలలు, మరియు ఇతర ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల ల్లో, విద్యా సంవత్సరం 2020-21 లో నాలుగవ తరగతి చదివిన విద్యార్థులు అందరూ ఈ పాఠశాలల్లో ప్రవేశాలకు అర్హులు.
ఖాళీల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
1. TTWURJC (బాలురు), క్రీడా పాఠశాల ఎటురునాగారం.
● 2021 22 విద్యాసంవత్సరానికి గాను ఐదవ తరగతి ప్రవేశాలకు 40 సీట్లను శాంక్షన్ చేశారు.
2. TTWURJC (బాలికలు), క్రీడా పాఠశాల చెంగుట.
● 2021 22 విద్యాసంవత్సరానికి గాను ఐదవ తరగతి ప్రవేశాలకు 40 సీట్లను శాంక్షన్ చేశారు.
ఈ 02 పాఠశాలలో ప్రవేశం పొందిన (బాలురు& బాలిక) లకు ఉచిత బోర్డింగ్, హాస్టల్, రెండు జతల పిటి దుస్తులు, ఒక జత ట్రాక్ సూట్, కిట్ బ్యాగ్, వాటర్ బాటిల్, టవల్ మొదలైనవి తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ చేత అందించబడతాయి.
1. 02 స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాలు 5వ తరగతి కి మాత్రమే.
2. విద్యార్థిని విద్యార్థులు శారీరకంగా ఫిట్ మరియు స్ట్రాంగ్ గా ఉండాలి.
3. ఎంపిక ప్రమాణాలు షెడ్యూల్స్ తో పాటు త్వరలో తెలియజేయడం తాయి.
4. ఎంపికైన అభ్యర్థులు స్పోర్ట్స్ స్కూల్స్ లో ప్రవేశం పొందే సమయంలో ఈ క్రింది ధ్రువపత్రాలను తప్పనిసరిగా సమర్పించాలి.
● కుల దృవీకరణ పత్రము,
● ఆదాయ ధ్రువీకరణ పత్రమ,
● మార్కుల మెమో,
● స్టడీ సర్టిఫికేట్,
● టిసి,
● మెడికల్, ఫిట్నెస్ సర్టిఫికెట్,
● 06 పాస్పోర్ట్ ప్రైస్ ఫోటోలు.
● ఆధార్ కార్డు, మొదలగునవి సమర్పించాలి.
5. 2021-22 ఆర్థిక సంవత్సరానికి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం, పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి 2లక్షల రూపాయలు, గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి 1లక్ష 50 వేల రూపాయలకు మించకూడదు.
6. విధ్యార్థి యొక్క 100 కేబి పాస్పోర్ట్ సైజ్ ఫోటో, 50కేబి సంతకం అప్లోడ్ చేయలీ.
దరఖాస్తు ప్రక్రియ:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 07.06.2021.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 24.06.2021.
ఫిజికల్ ఫిట్నెస్ పరీక్ష నిర్వహించు తేదీ: త్వరలో ప్రకటిస్తారు.
దరఖాస్తు ఫీజు: రూ.50/-
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి:
1. దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించడానికి అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
అధికారిక వెబ్ సైట్ లింక్:
2. అధికారిక హోమ్ పేజీలోని లేటెస్ట్ నోటిఫికేషన్ క్రింద కనిపిస్తున్న తెలంగాణ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ స్పోర్ట్స్ స్కూల్ ఐదవ తరగతి అడ్మిషన్స్ 2021-22 లింక్ పై క్లిక్ చేయండి.
3. దరఖాస్తులు చేయడానికి సంబంధించిన పేజీ ఓపెన్ అవుతుంది.
4. దరఖాస్తు చేసుకోవడానికి ముందు నోటిఫికేషన్ను పూర్తిగా చదవండి.
5. అర్హత ప్రమాణాలు కలిగిన విద్యార్థినీ విద్యార్థులను ప్రవేశాలకు రిజిస్టర్ చేయడానికి టు పే ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రీ లింక్ పై క్లిక్ చేయండి.
6. సంబంధిత వివరాలను ఎంటర్ చేసి అప్లికేషన్ ఫీ ప్లే చేయండి. ఫీ పే చేసిన రిషిప్ట్ ను ప్రింట్ తీసుకోండి.
7. దరఖాస్తులను ఆన్లైన్లో సబ్మిట్ చేయడానికి టు సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ పై క్లిక్ చేయండి.
8. సంబంధిత వివరాలను ఎంటర్ చేసి దరఖాస్తులను విజయవంతంగా ఆన్లైన్లో సమర్పించండి.
9. ప్రింట్ తీసుకొని భద్రపరుచుకోండి.
అధికారిక వెబ్సైట్: https://tgtwgurukulam.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్:
దరఖాస్తులు చేసుకోవడానికి డైరెక్ట్ లింక్: http://kishoremamilla-001-site3.itempurl.com/start.html
Comments
Post a Comment